బాలకృష్ణ – బోయపాటి సినిమా టైటిల్ ‘అఖండ’, టైటిల్ రోర్ వీడియో

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ #BB3 మే 28 న వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ మూవీ కి సంబదించిన ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూ అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ముందు నుండి ఈ చిత్ర టైటిల్ విషయంలో అనేక పేర్లు ప్రచారం కాగా..తాజాగా ఈ రోజు ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ అఫిషియల్ గా ఒక పవర్ ఫుల్ టైటిల్ ‘అఖండ’ అని అనౌన్స్ చేసింది. అంతేకాదు అఖండ టైటిల్ రోర్ అని ఒక వీడియో విడుదల చేసింది, థమన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. వీడియో చుసిన అభిమానులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వీడియో లో ‘కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అని బాలకృష్ణ ఒక పోరు ఫుల్ డైలాగ్ చెప్తూ గర్జించాడు.