భోళా శంకర్ లో తమన్నా సీన్స్ కట్.. కట్.. ?


మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో భోళా శంకర్ ఒకటి. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అన్నా చెల్లెలు సెంటిమెంట్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో మెగాస్టార్ కు చెల్లెలుగా టాలెంటెడ్ నటి కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే చిరుకు జోడిగా తమన్నా నటిస్తుంది.

అన్నాచెల్లెల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో తమన్నా పాత్రకి ఏమాత్రం ప్రాధాన్యత లేదట. ముందు పెట్టాలి అనుకున్న సన్నివేశాలను కూడా చిత్ర నిడివి కారణంగా కట్ చేస్తున్నారని సమాచారం. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. చిరంజీవి ఇదివరకు తమన్నాతో కలిసి సైరా చిత్రం చేయగా, ఇది వారిద్దరి కంబినేషన్లో రెండో సినిమా.