బాక్స్ ఆఫీస్ వద్ద బింబిసార వసూళ్ల సునామీ

కళ్యాణ్ రామ్ , కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ జంటగా వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా బింబిసార. టైమ్​ ట్రావెల్​ సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ మూవీ లో కల్యాణ్​రామ్​.. పౌరాణిక పాత్రలో కనిపించారు. చిరంతన్ భట్ ఈ సినిమా పాటలకి సంగీతం అందించగా.. ఎం ఎం కీరవాణి బాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఎన్టీఆర్​ ఆర్ట్స్ బ్యానర్​పై కల్యాణ్​రామ్​ స్వయంగా నిర్మించారు.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడం తో ..బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రెండు రోజుల్లో నైజాంలో రూ. 3.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 70 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 89 లక్షలు, కృష్ణాలో రూ. 59 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో కలిపి రూ. 10.82 కోట్లు షేర్, రూ. 17.20 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.00 కోట్లు గ్రాస్ సాధించింది.