హీరో మూవీ ఫై రామ్ చరణ్ కామెంట్స్

సంక్రాంతి బరినుండి ఆర్ఆర్ఆర్ తప్పుకోవడం తో చిన్న చిత్రాలు సంక్రాంతి ని క్యాష్ చేసుకుంటున్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటిస్తున్న ‘హీరో ‘ ఒకటి. దేవ‌దాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించగా.. ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మించారు. ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.. అశోక్ స‌ర‌స‌న నటించింది. జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య‌ తదితరులు నటించారు. నిన్న రిలీజ్ అయినా ఈ మూవీ కి పాజిటివ్ టాక్ రావడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా లలో సినిమా ఫై ప్రశంసలు కురిపిస్తుండడం తో ప్రేక్షకుల్లో సినిమా చూడాలనే ఆసక్తి పెరుగుతుంది.

ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ సినిమా ఫై కామెంట్స్ చేయగా..తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా సినిమా ఫై ప్రశంసలు కురిపించాడు. “గల్లా అశోక్.. సినిమా ప్రపంచంలోకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చావు.. ‘హీరో’ సినిమాను చూసి పూర్తిగా ఆనందించాను. జయదేవ్ గల్లాగారు, పద్మావతీ గల్లా గారు మరియు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, చిత్ర బృందానికి మొత్తానికి అభినందనలు. మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.