చిరంజీవిని సల్మాన్ ఖాన్ రీప్లేస్ చేయగలడా ?

భారీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ శంకర్‌. ఇప్పటివరకూ ఆయన ఒక్క తెలుగు హీరోతో కూడా సినిమా చేయలేదు.అయితే ఇప్పుడు రామ్‌చరణ్‌ కథానాయకుడిగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునుంది. దిల్‌రాజు నిర్మాతగా ఇటీవల ఈ సినిమాను ప్రకటించారు. కొత్త చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. బాలీవుడ్ లో చిరంజీవి పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడట, ఈ వార్త అధికారికంగా రానప్పటికీ ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే మరికొందరి చిరంజీవి ప్లేస్ ని సల్మాన్ ఖాన్ భర్తీ చేయగలడా అని అనుకొంటున్నారు.