డియర్ కామ్రేడ్ ఎలా ఉందంటే..

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ..రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ . భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు (జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ నాల్గు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుండడం తో ఈ చిత్ర ఓపెనింగ్స్ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

కన్నడ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

గీత గోవిందం తర్వాత విజయ్ , రష్మిక జంటగా నటించడం..సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయడం తో సినిమా ఎలా ఉందొ చూడాలని..సినిమా టాక్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అభిమానులు , సినీ ప్రేక్షకులు , చిత్ర వర్గాలు ఎంతో ఆతృతగా ఉన్నారు. మరి వారి ఆత్రుత కు కామ్రేడ్ ఏ సమాధానం చెప్పాడో పబ్లిక్ టాక్ లో చూద్దాం.

డియర్ కామ్రేడ్ లో విజయ్ , రష్మిక నటన హైలైట్ గా ఉందని.. తెరపై మరోసారి వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని అంటున్నారు. నూతన డైరెక్టర్ భరత్ కమ్మ తొలిచిత్రంతోనే ఆకట్టుకున్నారట. నెరేషన్ చాలా బాగా చేశారని అంటున్నారు. కాకపోతే, ఆ నెరేషన్ చాలా నెమ్మదిగా సాగిందని అభిప్రాయపడుతున్నారు. ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ సాగదీసినట్టు ఉందని చెపుతున్నారు.

మరికొంతమంది మాత్రం సినిమా కమర్షియల్ రేంజ్‌లో లేదని.. కానీ, ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఒక్కసారి చూడదగిన సినిమా అంటూ కొందరు వెల్లడించారు. సినిమా సూపర్ హిట్ అని, అందులో తిరుగేలేదని కొందరు ట్వీట్లు చేస్తు్న్నారు. ‘కడలల్లే’ పాట అయితే ప్యూర్ గోల్డ్ అంటూ కొనియాడుతున్నారు. ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు లేకపోవడం, కాస్త స్లోగా, లెంగ్తీగా ఉండటం తప్ప సినిమాకు పెద్దగా మైనస్‌లు లేవని చెబుతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయని టాక్. ఓవరాల్ గా గీత గోవిందం అంత రేంజ్ లో కాకపోయినా పర్వాలేదు,…సెకండ్ హాఫ్ ఫై ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు అని చెపుతున్నారు.