‘డియర్ కామ్రేడ్’ రన్ టైం ఎంతో తెలుసా ?


కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. దక్షిణాది అన్ని బాషాల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ ని తీసుకెళ్లారు విజయ్. డియర్ కామ్రేడ్ సంగీతోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి అన్యూహ్య స్పందన వచ్చింది. ఈ జోష్ లో సినిమాపై విజయ్ కి మరింత నమ్మకం పెరిగినట్టుంది. సినిమా రన్ టైంని మరింతగా పెంచేశాడు.

ముందు డియర్ కామ్రేడ్ రన్ టైమ్ ని2 గంటల 30 నిమిషాలకు కుదించారు. కానీ స్వయంగా విజయ్ దేవరకొండ రంగంలోకి దిగి 169 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశాడు. ఈ రన్ టైంతోనే సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ పొందింది. అర్జున్ రెడ్డి సినిమా అటు ఇటుగా 3 గంటల నిడివి ఉంది. హిట్ అయిన తర్వాత అదనంగా సన్నివేశాలు జోడించడంతో రన్ టైమ్ మరో 8 నిమిషాలు పెరిగింది. ఇప్పుడు అదే బాటలో విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ కూడా ఉండనుంది.