‘డియర్ కామ్రేడ్’ జ్యూక్ బాక్స్


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. రష్మిక మందన కథానాయిక. దక్షిణాది అన్ని బాషాల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని విడుదల చేసింది చిత్రబృందం.

సినిమాలో మొత్తం 8 పాటలున్నాయి. దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిలో డియర్ కామ్రేడ్ ఆంథమ్ ని స్వయంగా విజయ్ దేవరకొండ ఆలపించారు. కామ్రేడ్ పాటలని మీరు వినేయండీ.. !