ధనుష్ తో సుకుమార్..?

పుష్ప తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్..ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 ఫై ఫోకస్ చేసాడు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టి దసరా బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ట్రై చేస్తున్నాడు. ఇదిలా ఉంటె ..సుకుమార్ నెక్స్ట్ తమిళ్ హీరో ధనుష్ తో ఓ మూవీ చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ కథకు ధనుష్ బాగా ఇంప్రెస్ అయ్యాడని త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతోందని సమాచారం.

ఆల్రెడీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాకి కమిట్ అవగా.. ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘సార్’ అనే మూవీ షూటింగ్ కూడా మొదలయింది. తమిళంలో ఈ సినిమా ‘వాత్తి’గా విడుదలకానుంది. ‘పుష్ప’ లో బన్నీ మాస్ అప్పీల్ కు, పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయిన ధనుష్ తాను కూడా సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందని అంటున్నారు.