Surya Kiran : ‘సత్యం’ డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి


తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజు మృతి చెందారు. తెలుగులో సుమంత్ హీరోగా నటించిన ‘సత్యం’ మూవీతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సూర్య కిరణ్.. ఆ తర్వాత ధ‌న 51, రాజూభాయ్‌, చాప్ట‌ర్ 6, నీలిమై త‌దిత‌ర చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇక తమిళ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన అరసి సినిమాకు దర్శకత్వం వహించారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో పాల్గొన్నారు. ఇక బాలనటుడిగాను సూర్య కిరణ్ దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు.

Kiran Abbavaram : ఆ హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్..

ఇకపోతే సూర్య‌కిర‌ణ్‌ న‌టి క‌ళ్యాణి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ, కొన్నాళ్ల‌కు వ్యక్తిగత కారణాలతో ఈ దంప‌తులు విడిపోయారు. సూర్య కిరణ్ సోదరి సుజిత కూడా నటే. ఈమె తమిళ, తెలుగు చిత్రాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. సూర్య కిరణ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. కాగా సూర్యకిరణ్ మృతి వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో విషాదం నింపింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.