ఫిల్మిం ఛాంబర్ కు అక్కినేని భౌతికకాయం

Akkineni's-cremationఅక్కినేని మృత దేహాన్ని ప్రత్యేక వాహనంలో ఫిల్మిం ఛాంబర్ కు తరలించారు. అక్కినేని మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించే సమయంలో.. ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫిల్మిం ఛాంబర్ వద్ద దాదాపు అరగంట పాటు వుంచే అవకాశం వుంది. అనంతరం అక్కినేని అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంచనాలతో చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఆయన మృతితో దిగ్భ్రాంతి చెందారు. రాజకీయ, సినీ అభిమానులంతా ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు క్యూకట్టారు.