గాడ్ ఫాదర్ మెగా లుక్ !


ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిరంజీవి బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక చిరంజీవి పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ వీడియో కి ట్రమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఒక కార్యాలయం వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు అతని కోసం వేచి ఉండగా, మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో రావడం, సునీల్ కార్ డోర్ తీయగా గాడ్ ఫాదర్ గా చిరంజీవి కారు నుండి బయటకు వచ్చి, ఆఫీస్‌ లోకి ఫిరోషియస్ గా నడుచుకుంటూ వచ్చారు. ఈ గ్లింప్స్ వీడియోకి థమన్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా వుంది, పాత్రని మరింత ఎలివేట్ చేసింది. గాడ్ ఫాదర్ లో మెగా స్టార్ చిరంజీవి లుక్ విడుదల చేయడంతో మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గాడ్‌ఫాదర్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి , ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించననున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా గాడ్‌ఫాదర్‌ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.