Bhimaa : మహా శివరాత్రికి గోపీచంద్ ‘భీమా’ విడుదల


మాచో స్టార్ గోపీచంద్ హీరోగా వస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘భీమా’. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష తెలుగులోకి పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ గోపీచంద్ సరికొత్త పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మహా శివరాత్రికి మార్చి 8న ‘భీమా’ విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఇక రిలీజ్ డేట్ పోస్టర్ లో పోలీసు అవతార్‌లో ఫెరోషియస్ గా కనిపించారు గోపీచంద్. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.