శ్రీదివ్య కు ఎవరెంటే ఇష్టమో తెలుసా..?

actress-sri-divyaహనుమాన్ జంక్షన్ చిత్రం తో తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన శ్రీ దివ్య..ఆ తర్వాత మనసారా అనే చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..తెలుగుదనం ఉట్టిపడే కథానాయికగా మంచి మార్కులే కొట్టిసిన కానీ అమ్మడికి తెలుగు లో ఎక్కువ అవకశాలు రాలేదు..దీంతో తమిళ బాట పట్టి అక్కడ వరుస యంగ్ హీరోస్ తో నటిస్తూ బాగా పాపులర్ అయ్యింది..

ఇక తమిళం లో బాగా పేరు తెచ్చుకున్న ఈ భామ కు సూర్య అంటే అమితమైన ఇష్టమట..సూర్య నటించిన చిల్లన్ను ఒక కాదల్ చూసినప్పుడే ఆయనంటే ఇష్టం ఏర్పడిందని తెలిపింది. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌ పక్కన పెన్సిల్ చిత్రం లో నటించింది..