దీపావళి కానుకగా జెర్సీ రీమేక్

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జెర్సీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై క్రికెట్- మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు నాట హిట్ టాక్ తెచ్చుకొని..మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు , అల్లు అరవింద్ కలిసి రీమేక్ చేయబోతున్నారు.

ఈ రీమేక్ లో షాహిద్ క‌పూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూట్ కూడా ఈ మధ్యన పూర్తి కాగా షాహిద్ కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు. మరి అక్కడ కూడా భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం విడుదలకు మేకర్స్ ఒక డేట్ ను ఫిక్స్ చేసేసారు. మరి ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారం మేకర్స్ ఈ ఏడాది దీపావళి రేస్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఎన్నో అడ్డంకుల్లోనే షూట్ ను పూర్తి చేసుకొని వచ్చే నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల చెయ్యడానికి ఫిక్స్ చేసారు.