అది మహేష్‌ను చూసే నేర్చుకోవాలి

mahesh
మహేష్ తో కలసి ‘బిజినెస్ మెన్’ లో నటించింది కాజల్. ఈ జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ మరోసారి సందడి చేయబోతుందీ జంట. ఈ నెల 20 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో మహేష్ తో తన వర్కింగ్ ఎక్స్పిరియన్స్ గురించి ఇలా చెప్పింది కాజల్. ”మహేష్ వెరీ కూల్. ‘బిజినెస్‍మేన్’ పోలిస్తే మహేష్ ఇప్పుడింకా యంగ్ అయిపోయారు. విజువల్స్ చూస్తే, మీకే అర్థమైపొయింటుంది. ఇక నటుడిగా ఒక్కో సినిమాకూ ఎదుగుతూ వెళ్ళడం కూడా మహేష్‍ను చూసి నేర్చుకోవాలి. సూపర్ స్టార్ అయినా కూడా ఇంకా ఏమేం చేయగలమా ? తపన ఆయనలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఎప్పుడూ వందశాతం బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి వుండటం ఆయనలోని గొప్ప లక్షణం” అని చెప్పుకొచ్చిందీ బాలాత్రిపుర సుందరి. ఇది ‘బ్రహ్మోత్సవం’ లో ఆమె క్యారెక్టర్ పేరు లెండి.