‘కొత్త జంట’ రెడీ అయ్యింది

kota janta
అల్లు శిరీష్, రెజినా జంటగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కొత్త జంట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నా ఈ చిత్రం విడుదలకు సిద్దమయింది. ఈ చిత్రాన్ని మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 786′ చిత్రంలోని ‘అటు అమలాపురం … ఇటు పెద్దాపురం’ పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాట చిత్రానికి హైలెట్ నిలుస్తుందని యూనిట్ చెబుతోంది. గౌరవం చిత్రంతో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిన శిరీష్ కు కొత్త జంట’ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.