మహేష్ నెంబర్ ‘వన్’

mahesh babu oneహాలీవుడ్‌ మూవీ మేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొనే ఐఎండిబి రేటింగ్స్‌లో మన ఇండియన్‌ మూవీస్‌కు ఈ మద్యకాలంలో మంచి చోటు దక్కుతోంది. అయితే తొలిసారిగా 1నేనోక్కడినే సినిమా ..రేటింగ్‌లో హాలీవుడ్‌ అల్టిమేట్ హిట్స్‌ ది డార్క్‌నైట్‌‌, ఇన్సెప్షన్‌ల సరసన చేరి రికార్ట్‌లకెక్కింది. మహేష్‌ ‘1’ సినిమా చూడ్డానికి హాలీవుడ్‌ సినిమాల తరహాలో ఉండటమే కాదు,రేటింగ్‌ పరంగా కూడా హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్స్‌ సరసన చేరి తిరుగులేని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఓ ఇండియన్‌ మూవీ ఈ ఘనత సాధించటం ఇదే తొలిసారి.నిన్నటివరకు అమీర్‌ఖాన్‌ 3ఇడియట్స్‌ సినిమా 8.5తో హయ్యస్ట్‌ రేటింగ్‌ కలిగిన ఇండియన్‌ మూవీగా తొలిస్ధానంలో ఉండగా,1 మూవీ మాత్రం హాలీవుడ్‌ చిత్రాలనే తలదన్నే రీతితో 9.1రేటింగ్‌ను సాదించి నెంబర్‌వన్‌ గా నిలిచింది.

one 5ఇక హాలీవుడ్‌ చిత్రాలు దిడార్క్‌నైట్‌ 9.0రేటింగ్‌తో,ఇన్సెప్షన్‌ 8.5రేటింగ్‌తో 1 మూవీ తర్వాతి స్ధానాలలో ఉండటం విశేషం. ఆడియెన్స్‌లో సినిమాకున్న క్రేజ్‌,వ్యూవర్స్‌ యొక్క ఓపినియన్స్‌ ఆదారంగా ఇచ్చే ఈ రేటింగ్స్‌ విషయంలో ఇలా ఓ తెలుగు సినిమా టాప్‌ రేటింగ్‌ను అందుకోవటం విశేషమనే చెప్పాలి. 1సినిమాకు ఇలా హయ్యస్ట్‌ రేటింగ్‌ ఇచ్చిన వారిలో ఎక్కువశాతం మంది 18నుంచి 30 ఏజ్‌ గ్రూప్ వాళ్లండగా..వీరిలో అబ్బాయిలకంటే ,అమ్మాయిలు 1మూవీకి మాగ్జిమమ్‌ రేటింగ్‌ను ఇచ్చారు. బాలీవుడ్‌ హీరోలను మించి మహేష్‌ ఇంటర్‌నెట్‌ డేటాబెస్‌లో నెంబర్‌వన్‌ ఇండియన్‌ హీరోగా నిలవటంతో సూపర్‌స్టార్‌ అభిమానులు యమ ఖుషీగా ఉన్నారు.