ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్


ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎక్కడ తగ్గకుండా స్టెప్స్ వేసి అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రేమరక్షిత్ కొరియోగ్రాఫీ చేయగా, కీరవాణి ఈ పాటకు సంగీతమందించారు.ఇప్పుడు ఈ పాట ను
యూట్యూబ్ లో విడుదల చేయడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటించగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు చేసారు. ఈ మూవీ మార్చి 25 న విడుదలై , రెండు వారాల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ నెలకొల్పింది.