నరేష్ చెల్లెలు బొమ్మాళి

allari naresh
న‌రేష్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ జంటగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. వీడు తేడా తో ఆక‌ట్టుకొన్న‌ చిన్నికృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ అనే టైటిల్ ను ఖారారు చేశారు. ఈ సినిమా టైటిల్ని ఎంచుకునే అవకాశాన్ని ప్రేక్షకులకు ఇచ్చారు. నాటు బాంబు … బ్రదర్ ఆఫ్ బొమ్మాళి .. అనే రెండు టైటిల్స్ నుంచి ఒక దానిని ఎంచుకోమంటే ఎక్కువ మంది రెండో దానికే ఓటేశారట. దాంతో ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ఫైనల్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ కు చెల్లెలుగా హీరోయిన్ కార్తీక నటిస్తోంది. అంటే బొమ్మాళి కార్తీకా అన్నమాట. చిత్రానికి అమ్మి రాజు నిర్మాత.