నయనతార కౌంటర్

నయనతార…ఈ పేరు తెలియని సినీ ప్రేమికులుండరు..లేడీ ఓరియంటెడ్ చేయాలన్న..ఓ సీత పాత్ర చేయాలన్న ..గ్లామరస్ పాత్ర చేయాలన్న..ఇలా ఏ పాత్ర ఇచ్చిన అందులో ఇమిడి పోయే నటి నయనతార. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అని ముద్దుగా అభిమానులు పిలుచుకుంటారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్ని అంటకాలు ఎదురైనా కానీ బయటకు మాత్రం ఆమె ఎప్పుడు చిరు నవ్వులు కురిపిస్తూ తన పనేంటో తాను చేసుకుంటూపోతుంది. అలాంటి ఆమె ఫై తమిళ నటుడు..నిర్మాత రాధా రవి బయటకు చెప్పలేని పదజాలంతో ఆమెను దూషించాడు. అది కూడా పబ్లిక్ ఫంక్షన్ లో.

ఆడవారిని గౌరవించాలని సినిమాల్లో చెప్పే వీరు..బయటమాత్రం ఆ ఆడవారికి గౌరవం ఇవ్వకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాధా రవి చేసిన కామెంట్స్ ఫై యావత్ సినిమా ఇండస్ట్రీ నటి నటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధా రవి చేసిన వాక్యాలు ఫై నయనతార స్పందించింది.

ఓ లేఖ రాసి అందులో త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది న‌య‌న‌తార‌. ముందు డిఎంకే పార్టీ నుంచి రాధా ర‌విని స‌స్పెండ్ చేసినందుకు స్టాలిన్‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. స్త్రీలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసిన రాధా రవి లాంటి వ్యక్తులపై వెంటనే యాక్షన్ తీసుకున్నారు.. అందుకు మీకు ధ‌న్య‌వాదాలు అంటూ రాసుకొచ్చింది న‌య‌న్. ఇక రాధా రవి గురించి మాట్లాడుతూ… స‌ర్ మీరు కూడా ఓ త‌ల్లికి పుట్టారు.. కానీ మీ లాంటి వ్యక్తులు మహిళల‌ను తక్కువ చేసి మాట్లాడటం మగతనం అనుకుంటారు.

ఏం చేస్తాం.. మీలాంటి వ్యక్తుల మధ్య మేం కూడా బ్రతకాల్సి వస్తోంది అంటూ నయనతార ఫైర్ అయింది. త‌న గురించి అంతా మాట్లాడుకోవాలనే చీప్ పబ్లిసిటీ కోసమే రాధా ర‌వి ఇలాంటి వ్యాఖ్య‌లు చేసార‌ని కాస్త ఘాటుగానే కౌంట‌ర్ ఇచ్చింది న‌య‌న‌తార‌. ఇక ఇలాంటి వాళ్లు మాట్లాడుతుంటే కొంద‌రు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయడం ఆశ్చ‌ర్యంగా అనిపించింద‌ని చెప్పింది న‌య‌న‌తార‌. ఈ వ్యవహారం రాజకీయ విశ్లేషకులు సైతం స్పందిస్తున్నారు..రాధా రవి లాంటి వారికీ బుద్ది చెప్పాలని కోరుతున్నారు. వారు ఇంకేం అంటున్నారో వారి మాటల్లోనే వినండి.