నితిన్ కు రెండో లవర్ గా నిధి అగర్వాల్

నితిన్ – ఎస్.ఆర్.శేఖర్ కలయికలో ‘మాచర్ల నియోజక వర్గం’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా రెండో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కనిపించనుందని సమాచారం. నితిన్ రీసెంట్‌గా మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈసినిమా ఓటీటీ వేదికగా నిన్న (శుక్రవారం ) విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.