హ్యాండిచ్చిన యంగ్ టైగ‌ర్‌

Jr NTR next movie with Sukumar

వ‌న్ – నేనొక్క‌డినే సినిమా సుకుమార్‌ కి ఓ పీడ‌క‌ల‌లా మారింది. ఆసినిమా ఫ్లాప్‌ తో సుక్కు ఇమేజ్ పాతాళంలోకి ప‌డిపోయింది. ఓ స్టార్ హీరోతో క‌న్‌ ఫ్యూజ్ క‌థ తీశాడంటూ…. సుక్కుపై విమ‌ర్శ‌లొచ్చాయి. దాంతో స్టార్ హీరోలు సుకుమార్‌ తో సినిమా చేయ‌డానికి వెనుకంజ వేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా సుక్కుకి హ్యాండిచ్చేశాడు. సుకుమార్ – ఎన్టీఆర్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం మొద‌లుకావాల్సివుంది. సుకుమార్ కూడా ఎన్టీఆర్ కోసం ఓ క‌థ రెడీ చేశాడు. అయితే… సుక్కుని కాద‌ని, వ‌క్కంతం వంశీ సినిమాకి లైన్‌ లోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్‌. దాంతో సుకుమార్ మ‌ళ్లీ బ‌న్నీ పంచ‌న చేరాడు. ఆర్య‌, ఆర్య‌2ల‌తో ఈ జోడి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేసింది. ఆర్య హిట్ట‌య్యింది. రెండో భాగం ప్ర‌తికూల ఫ‌లితాన్నిచ్చింది. మ‌రి ముచ్చ‌ట‌గా మూడో సినిమా ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో. అన్న‌ట్టు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తెర‌కెక్కించ‌నుంది. ఎన్టీఆర్ కాదంటే… బ‌న్నీతో సినిమా చేస్తున్నాడు సుకుమార్‌. ఈ సినిమాని హిట్ చేసి ఎన్టీఆర్‌ కి స‌మాధానం ఇవ్వాల‌నే నిశ్చ‌యంలో ఉన్నాడు.