ఎన్టీఆర్ రుబాబ్ చూపిస్తాడా??

ntr
త‌మాషా పేర్లే కాదు.. ప‌వ‌ర్ ఫుల్ టైటిళ్లు పెట్టడంలోనూ పూరి జ‌గ‌న్నాథ్ సిద్ధహ‌స్తుడే. ఇడియ‌ట్‌, పోకిరి అనే తిట్లని కూడా సూప‌ర్ హిట్ సినిమాల‌కు టైటిళ్లుగా పెట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకీ అలాంటి ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ కోసం వెదుతుతున్నాడు. ఈసినిమాకి కుమ్మేస్తా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా మ‌రో టైటిల్ వినిపిస్తోంది. అదే.. రుబాబ్‌. సోష‌ల్ మీడియాలో ఈ పేరు తెగ చ‌క్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ బాగుంది.. అంటూ షేర్లు మీద షేర్లు కొడుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ సినిమాకి మ‌రో మంచి టైటిల్ దొరికింది. అయితే చిత్రబృందం ఏ టైటిల్‌ని ఫైన‌లైజ్ చేస్తుందో చూడాలి.