వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ వస్తున్నాడట..

బిగ్ బాస్ సీజన్ 2 కు తెలుగు లో మంచి ఆదరణ లభిస్తుంది..శని , ఆది వారాల్లో నాని తనదయిన స్టయిల్ లో అదరగొడుతూ బాగా ఆకట్టుకోగా , మిగతా రోజుల్లో బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లను హౌస్ సభ్యులకు ఇస్తూ వారినే కాకుండా చూస్తున్న ప్రేక్షకులకు సైతం ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ సీజన్ లో సామాన్య వ్యక్తిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నూతన నాయుడు కేవలం రెండు వారాలకే బయటకొచ్చాడు. ఉన్న రెండు వారాలు తన ఆట, ప్రవర్తన, ఆలోచనా విధానంతో ప్రతి ఒక్కరినీ బాగా ఆకట్టుకున్నాడు. కానీ రెండు వారాలు గడవక ముందే ఎలిమినేట్ అయిపోయాడు.

నూతన్ ఎలిమినేట్ అవడం సగటు ప్రేక్షకుడికి ఏ మాత్రం నచ్చలేదు. హౌస్ లో ఉన్నప్పుడు ఎవరిని కూడా నిందించలేదు. ఎలిమినేట్ అయి బయటకు వచ్చే సమయంలో కూడా నూతన నాయుడు ప్రవర్తించిన విధానం, చూపించిన సంయమనం, పాజిటివ్ వైబ్రేషన్స్‌తో హోస్ట్ నాని కూడా ఫిదా అయిపోయాడు. నూతన్ బయటకు వచ్చిన తర్వాత హౌస్‌లో నెగిటివిటీ బాగా పెరిగిపోయిన సంగతి తెల్సిందే. దీంతో నూతన్ లాంటి పాజిటివిటీ, హ్యుమానిటీ ఉన్న వ్యక్తి హౌస్‌లో ఉంటే బాగుంటుందనే భావన చూస్తున్న ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నూతన్ మళ్లీ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యం లో బిగ్ బాస్ యాజమాన్యం సైతం వైల్డ్ కార్డ్ ద్వారా నూతన్ ను మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకరావాలని ఫిక్స్ అయ్యారట. అతి త్వరలో నూతన నాయుడు ను మళ్లీ హౌస్ లో చూడబోతున్నామని తెలుస్తుంది.