క్లైమాక్స్ లో చైతూ ‘లైలా’ వేట

cahitu
నాగచైతన్య హీరో రుపొందుతున్న చిత్రం ‘ఒక లైలా కోసం’. విజయ్‌కుమార్‌ కొండ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపుదశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రధాన తారాగణంతో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంకొక నెలలో షూటింగ్ భాగం ముగుస్తుంది. ‘ఒక అమ్మాయి కోసం… ఆమె ప్రేమకోసం అబ్బాయి పడిన కష్టమే ఈ చిత్రం. వినోదాత్మకమైన ప్రేమకథ ఇది. నాగచైతన్య కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాం. హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు వైవిధ్యంగా ఉంటాయని యూనిట్ చెబుతోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.