విదేశాల్లో హిట్టే!

mahesh-babu-1-Nenokkadineసినిమా ఎక్కడైనా సినిమానే! ఒక చోట హిట్టూ, మ‌రో చోట ఫ్లాపూ ఉండ‌దు. ప్రేక్షకుల అభిరుచి అన్నిచోట్లా ఒకేలా ఉంటుంది – ఇలాంటి మాట‌లు త‌ర‌చూ వింటుంటాం. అయితే ‘1’ ఫలితం విష‌యంలో మాత్రం ఈ స్టేట్‌ మెంట్‌ ని మార్చకోవ‌ల‌సిందే. ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన ‘1’ – నేనొక్కడినే సినిమాకి ఇక్కడ మిశ్రమ స్పంద‌న ల‌భించింది. రెండో రోజు నుంచీ వ‌సూళ్లు డ‌ల్ అయ్యాయి. ‘ఎవ‌డు’ వ‌చ్చిన త‌ర‌వాత పూర్తిగా త‌గ్గిపోయాయి. `1` సినిమాని ఇక్కడ ఫ్లాప్ అని ట్రేడ్ వ‌ర్గాలు, విమ‌ర్శకులు ఓ ముద్ర వేసేశారు. అయితే వారిని కూడా విదేశాల్లో ఈసినిమా సాధిస్తున్న వ‌సూళ్లు చూసి నివ్వెర పోతున్నారు. అక్కడ ఈ చిత్రం తొలివారంలోనే రూ.6.5 కోట్లు వ‌సూలు చేసింది. రెండోవారం మ‌రో రూ.3 కోట్లు రాబ‌ట్టుకొంది. అక్కడ వ‌సూళ్లు ఇంకా నిల‌క‌డ‌గానే ఉన్నాయి. మ‌రో వారం ఇలాగే కొన‌సాగితే – మ‌హేష్ సినిమాల్లోనే అత్యధిక గ్రాస‌ర్‌ గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని ఓవ‌ర్సీస్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.72 కోట్లు పెట్టిన ఈరోస్ సంస్థకు విదేశీ వ‌సూళ్లే ఊర‌ట‌.