20న గుస‌గుస‌లు

vuhalu
న‌టుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్ మెగా ఫోన్ పట్టి తీర్చిదిద్దిన చిత్రం ఊహ‌లు గుస‌గుస‌లాడే. నాగ‌శైర్య, రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని ఈనెల 20న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి చెబుతూ ”ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఆడియోకి మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. క‌ల్యాణి కోడూరి పాట‌లు తెర‌పై కూడా బాగుంటాయి. ఓ చ‌క్కని ఫీల్ గుడ్ స్టోరీ చూసిన అనుభూతి క‌లుగుతుంది” అన్నారు. ఈ సినిమా విజ‌యం.. అవ‌స‌రాల‌కు అతి ముఖ్యం. ఎందుకంటే ఈసినిమా హిట్టయితే… నాగ‌చైత‌న్యతో సినిమా చేసే ఛాన్స్ వ‌స్తుంది. అందుకే అటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈసినిమా ఎలా ఉంటుందో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.