పొల్లాచ్చిలో రామ్ ‘పండగ.. ‘

Ram-pandaga-cheskoరామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పండగ చేస్కో’. గోపీచంద్ మలినేని దర్శకుడు. ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 30తో పొల్లాచ్చి షెడ్యూల్ ముగియనుంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపిచంద్ మాట్లాడుతూ.. “ఈ నెల 16 నుంచి పొల్లాచ్చిలో ప్రధానమైన సన్నివేషాలను చిత్రీకరించడం జరిగింది. స్టన్ శివ నేతృత్వంలో మరికొన్ని సీన్స్ చిత్రీకరణతో ఆగస్టు 30న షెడ్యూల్ ముగుస్తుంద”న్నారు. రామ్ సరసన రకుల్ ప్రీత్ జతకట్టనుంది. ఫుల్ లెన్త్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో.. బ్రహ్మానందం, రావు రమేష్, సాయి కుమార్.. తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్. పరుచూరి కిరీటి నిర్మాత.