Bro Movie Review : బ్రో రివ్యూ

Bro Movie Review

MAIN CAST: Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier, Ketika Sharma, Brahmanandam, Subbaraju, Urvashi Rautela and others
DIRECTOR: Samuthirakani
MUSIC: S Thaman
PRODUCER: T G Vishwa Prasad

TeluguMirchi Rating: 3.25/5

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro The Avatar) ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందంటే ఆ క్రేజే వేరు. అలాంటిది మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమా అంటే ఇంక థియేటర్లు బద్దలైపోవడం ఖాయం. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లు గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

ఒక పెద్ద కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తూ ఉంటాడు మార్కండేయులు అలియాస్ మార్క్( సాయి ధరమ్ తేజ్). ఒక సగటు మధ్యతరగతి ఉద్యోగిగా మార్కండేయులు జీవితంలో దేనికీ సరిగా సమయం కేటాయించలేక ప్రతి చిన్న విషయానికి టైం లేదు టైం లేదు అంటూ ఉరుకుల పరుగులతో జీవిస్తూ ఉంటాడు. తనతో పాటు తన కుటుంన సభ్యుల లైఫ్ ఎలాగైనా సెటిల్ చేయాలని కష్టపడుతూ ఉంటాడు. అలా ఉరుకులు పరుగులతో జీవిస్తున్న అతను అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురై మరణిస్తాడు. అయితే అక్కడే అతనికి టైం ( పవన్ కల్యాణ్) ఒక మనిషి రూపంలో ఎదురు వస్తుంది. కొన్ని కారణాల వల్ల తనకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఆ తరువాత మార్క్ చేయాలనుకున్న పనులు ఏమిటి? మార్క్ అనుకున్నవన్నీ జరిగాయా? మార్క్ తో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్న రమ్య (కేతిక శర్మ) ఏమైంది? చివరికి మార్క్ బతికే ఉంటాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, ఇలా దేవుడు భక్తుడు లాంటి కాన్సెప్ట్ మూవీస్ లో దేవుడు కొన్ని సీన్స్ కే పరిమితం అవుతూ ఉంటాడు కానీ ఇక్కడ పవన్ ముందే చెప్పినట్లు దాదాపు 80% సీన్స్ లో కనిపిస్తాడు….తన స్టైల్, స్వాగ్, ఎనర్జీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయి. సాయి ధరం తేజ్ కి కరెక్ట్ గా సెట్ అయిందని చెప్పొచ్చు.. కేతిక శర్మ సాయి ధరంతేజ్ సరసన నటించిన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ప్రియ ప్రకాష్ వారియర్ , రోహిణి , యువలక్ష్మి వంటి వాళ్లకు కాస్త పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సముద్రఖని కనిపించింది ఒక సీన్ లోనైనా ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రధారులు సైతం తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఫైనల్ పాయింట్ : పవన్ వన్ మాన్ షో