Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ కూడా ఆరోజేనా ?


ఇటీవలే ‘సలార్’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని చేస్తున్నాడు. వైజయంతి మూవీస్ పతాకం పై సి అశ్వినీ దత్ ఈ మూవీని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌ గా నటిస్తుంటే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఈ మూవీ రిలీజ్ పైనే వుంది.

అయితే సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇకపోతే వాస్తనానికి ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.. కానీ కుదరలేదు. కాగా ‘కల్కి 2898 AD’ సినిమా మే 9 న రిలీజ్ చేస్తారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’, ‘మహర్షి’ సినిమాలు మే 9 న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు కల్కి లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని కూడా ఆ డేట్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికారక సమాచారం లేదు.