గుర్రం దౌడు తీస్తోంది

allu-arjun

రేసుగుర్రంలో ల‌క్కీగా క‌నిపించాడు అల్లు అర్జున్‌. ఆ పాత్ర పేరే కాదు.. బ‌న్నీ కూడా నిజంగా ల‌క్కీనే. ఎందుకంటే.. ఈ స‌మ్మ‌ర్‌ లో ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారో.. అలాంటి సినిమానే అందించాడు బ‌న్నీ. గ‌త‌వారం విడుద‌లైన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌… రికార్డు వ‌సూళ్ల దిశ‌గా దూసుకుపోతోంది. తొలివారం రూ.33 కోట్ల వ‌సూళ్లు ద‌క్కించుకొందీ చిత్రం. ఓవ‌ర్సీస్‌లోనూ భారీ వ‌సూళ్లు ల‌భిస్తున్నాయి. అక్క‌డ ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసింది. గ‌తంలో జులాయి రూ.8.5 ల‌క్ష‌ల డాల‌ర్లు సంపాదించింది. ఇప్పుడా రికార్డ్‌ ని తొలివారంలోనే దాటేసిందీ రేసుగుర్రం. ప‌రీక్ష‌లు పూర్తికావ‌డం, వేస‌వి సెల‌వ‌ల సీజ‌న్‌, బాక్సాఫీసు ద‌గ్గ‌ర లెజెండ్ హంగామా త‌గ్గ‌డం.. ఈ సినిమాకి క‌లిసొచ్చాయి. అందుకే.. రాబోయే రోజుల్లోనూ ఈ వ‌సూళ్లు నిల‌క‌డ‌గా సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదే జోరు కొన‌సాగితే రూ.50 కోట్ల మైలు రాయి చేరుకొనే అవ‌కాశం ఉంది