బహుబలి షూటింగ్ కి రజనీ !

rajani
జక్కన్న రాజమౌళి ఫుల్ హ్యాపీ గా వున్నారు. కారణం…సూపర్ స్టార్ రజనీ కాంత్. రజనీకాంత్ ‘విక్రమసింహ’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ఐమాక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాలోగొన్న రాజమౌళికి ఊహించని సంఘటన ఎదురైయింది. ఈ వేడుకలో రాజమౌళి తో మాట్లాడిన రజనీ.. ‘నాకు ఒకసారి బాహుబలి సెట్స్ కి వచ్చి నువ్వు చేసే షూటింగ్ చూడాలని వుంది అని చెప్పారట.’ ఈ సంఘటన నా జీవితంలో మరువలేనిది అని, దానికి నేను ఏం మాట్లాడాలో తెలియక “థాంక్ యు సార్” అన్నానని రాజమౌళి తన ఆనందాన్ని ట్విట్టర్ రాసుకొచ్చారు.