‘గేమ్‌ ఛేంజర్‌’ గా రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్ అయ్యింది. శంకర్ దర్శకత్వం రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీకి గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఉదయం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు.