రామారావు ఎంట్రీ అప్పుడేనా ?

క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ..ప్రస్తుతం తన 68 వ సినిమాతో బిజీ గా ఉన్నాడు. శరత్ మండవ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రామారావు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్ తో సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి చివరి షెడ్యూల్ షరా వేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీ లో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చ్ 25, 2022 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇదిలా ఉండగా రవితేజ నటిస్తున్న ఖిలాడీ చిత్రం ఫిబ్రవరి 11 న , ధమాకా చిత్రం ఆగష్టు లో విడుదల కోబోతున్నట్లు సోషల్ మీడియా టాక్.