USలో చరణ్ ’తుఫాన్’

thufanమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన బాలీవుడ్ మూవీ ‘జంజీర్’, ఈ చిత్రం తెలుగు వర్షన్ ’తుఫాన్’అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతోంది.  ‘బ్లూస్కై సినిమాస్’ సంస్థ ఈచిత్రాన్ని అమెరికాలో విడుదల చేస్తోంది. 170 లోకేషన్లలో ఈ రెండు వెర్షన్లు రిలీజ్ అవుతున్నాయి. కేవలం న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లోనే 17 స్క్రీన్స్ మీద సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదల అవుతుండడం విశేషం. ఈ చిత్రంలో.. చరణ్ కు జంటగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించడంతో ఈ చిత్రాన్ని మరింత క్రేజ్ వచ్చింది.