రాశీ..హాట్ బ్యాక్‌లెస్ డ్రెస్‌ పోజ్

రాశి ఖన్నా ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీ గా ఉంది. తెలుగులోనూ అడపాదడపా అవకాశాలొస్తున్నాయ్. ఇప్పటికిప్పుడు షెడ్యూల్స్ పరిశీలిస్తే.. రెండేళ్ల పాటు రాశీ డైరీ ఫుల్ అయింది. ఆన్ సెట్స్ లో కొన్ని సినిమాలుంటే.. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నవి మరికొన్ని. వీటిలో ఎక్కువగా కోలీవుడ్ సినిమాలే ఉన్నాయి. ఓ పక్క సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉన్నప్పటికీ ..సోషల్ మీడియా లో సరికొత్త ఫోటో షూట్స్ తో అలరిస్తుంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఆమె బ్యాక్‌లెస్ డ్రెస్‌ను ధరించి కనిపించింది. దీంతో వెనుక నుంచి ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన రాశీ ఖన్నా ఫొటోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది.