నిర్మాతగా మారబోతున్న రవితేజ !

సంక్రాంతి రేస్ లో వచ్చిన ‘క్రాక్‌’ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో మాస్ మ‌హారాజా మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూలు చేసి ర‌వితేజ చిత్రాల్లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా వున్న హీరో రవితేజ త్వరలో చిత్ర నిర్మాణంలోకి దిగనున్నాడు. దీనికోసం సొంత నిర్మాణ సంస్థ ని ‌ ‘ఆర్టి వర్క్స్’ పేరిట రిజిస్టర్ చేశారు. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు ఈ ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేయనున్నట్లు టాక్, దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తొలి ప్రయత్నంగా ఓ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ మలయాళ హీరో నటిస్తాడని తెలుస్తోంది.