RC15 నుండి చరణ్ మరో లుక్ లీక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కలయికలో RC15 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పంజాబ్‌లోని అమృత్ సర్‌లోని ఓ యూనివర్సిటీలో జరుగుతుంది.

గురు నానక దేవ్ యూనివర్సిటీలో ప్రస్తుతం రామ్ చరణ్, కియారా అద్వాణీల మీద కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబదించిన పిక్స్ లీక్ అవ్వడం తో షూటింగ్ తాలూకా విశేషాలు బయటకొచ్చాయి. ఇక ఈ పిక్స్ లలో లైట్‌గా బియర్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ కాలేజ్ సీన్స్ మాత్రం అదిరిపోయాయని అంటున్నారు. ఇక రాజమండ్రిలో జరిగిన షూటింగ్‌లో తెల్ల పంచెకట్టులో చరణ్ కనిపించాడు. ఇక ఇప్పుడు కాలేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఇలా రెండు షేడ్స్ లలో చరణ్ కనిపిస్తుండడం అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది.