మే 25న రౌడీ ఫెలో పాట‌లు

rowdy-fello

ఈ శుక్ర‌వారం ప్ర‌తినిధిగా మ‌న ముందుకు వ‌స్తున్నాడు నారా రోహిత్‌. ఆ త‌ర‌వాత త‌న సినిమాల్ని వ‌రుస‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌ణాళిక‌లు వేసుకొంటున్నాడు రోహిత్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న రౌడీ ఫెలో సినిమాని జూన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. మే 25న ఈ చిత్రంలోని గీతాల్ని ఆవిష్క‌రిస్తారు. స‌న్నీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గీత ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య రౌడీ ఫెలో సినిమాతో ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తాడు. విశాఖ సింగ్ క‌థానాయిక‌. ఇటీవ‌ల రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే పాట‌ల కోసం శ్రీ‌లంక వెళ్తున్నారు. ఇదో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రోహిత్ పాత్ర తీరుతెన్నులు ఆక‌ట్టుకొంటాయి. ద‌ర్శ‌కుడిగా త‌న తొలి సినిమాలోనే కృష్ణ చైతన్య త‌న ప్ర‌తిభ నిరూపించుకొంటాడు… అని చిత్ర‌బృందం చెబుతోంది.