ఆర్ఆర్ఆర్ రన్ టైం ఎంతో తెలుసా..?

రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 07 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ల ఫై దృష్టి సారించారు.

శుక్రవారం జననీ సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకోగా..ఈ చిత్ర రన్ టైం కు సంబదించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాకి జక్కన్న దాదాపు3 గంటలు రన్ టైమ్ ఫిక్స్ చేశారట. సాధారణంగా రాజమౌళి సినిమాలకి 2 గంటల 50 నిమిషాలకు తక్కువ కాకుండా రన్ టైమ్ ఉంటుంది. ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో రన్ టైమ్ ను సెట్ చేశారట. ఈ సినిమా ఎలాగూ విజువల్ వండర్ కాబట్టి.. అభిమానులకు అది అంతగా పట్టింపు ఉండదని ఆయన నమ్మకమట. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.