బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. పీరియాడిక్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబందించిన నటి నటుల వివరాలు తప్ప చిత్ర లోగో కానీ హీరోల తాలూకా ఫస్ట్ లుక్ గాని విడుదల చేయకపోయేసరికి అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని దేశ వ్యాప్తంగా అంత ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరం సంధర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోట్లేదు అభిమానులు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్టర్ వేదికగా 2020కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చేద్ధాం.. మేము దానిపై పని చేస్తున్నాము అంటూ పోస్ట్ చేసింది. టీమ్ క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు పండగ చేసుకోవచ్చు.
?Yes… We are working on it ??
Okay, let’s give your fandom a blasting start to 2020 with a # trend tomorrow!
What will it be?#YearOfRRR or #HappyRRRYear https://t.co/wAppKMwfqu
— RRR Movie (@RRRMovie) December 31, 2019