‘సాహో’ ఫలితంతో సైరా లో ఫ్రొఫైల్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణమైన పరాజయం పాలయిన విషయం తెల్సిందే. నిర్మాతలకు మరియు బయ్యర్లకు భారీ నష్టాలను ఆ చిత్రం మిగల్చబోతుంది. 350 కోట్ల సినిమా అవ్వడంతో భారీ ప్రమోషన్స్‌ చేశారు. విడుదలకు రెండు వారాల ముందు నుండి ఎక్కడ చూసినా, ఏం మాట్లాడినా కూడా సైరా గురించే చర్చ. అంతటి పాపులారిటీని దక్కించుకున్న సాహోకు నెగటివ్‌ టాక్‌ రావడంతో దారుణంగా పరాభవం పొందాల్సి వచ్చింది. అయితే సినిమాకు ఎక్కువ టాక్‌ రాకుండా ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

సాహో చిత్రంకు ఎదురయిన అనుభవంను సైరాకు ఎదురు అవ్వకుండా ప్రమోషన్‌ విషయంలో లో ఫ్రొపైల్‌ను మెయింటెన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సాహో చిత్రం అతి ప్రమోషన్‌ వల్లే నిరాశ పర్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సైరా చిత్రం ప్రమోషన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అక్టోబర్‌ 2 లేదా ఆ తర్వాత వారంలో సైరా రాబోతున్న విషయం తెల్సిందే.