‘జగదాంబ’ ఎవరనేది సస్పెన్స్ !

sai
సాయిరామ్‌ శంకర్ హీరోగా మరో కొత్త శ్రీకారం చుట్టారు. టైటిల్ ‘జగదాంబ’. పి.ఎస్.వాసుదేవ్ దర్శకుడు. అడ్డాల పెద్దిరాజు నిర్మాత. తాజాగా ఈ చిత్రం ముహూర్తం జరుపుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ”అమాయకుడైన ఓ యువకుడికి తన మరదలంటే ప్రాణం. గిల్లికజ్జాలతో సరదాగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో వారి జీవితం ఎలా మారిందనేది ఈ చిత్రం” అన్నారు. సాయిరామ్‌శంకర్ మాట్లాడుతూ ”నా సినీ జీవితంలో నాకు దక్కిన మంచి పాత్ర ఇది. కథలో వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. జగదాంబ ఎవరు.. దాని వెనుక కథేంటనేది కీలకం” అన్నారు. చిత్రానికి రాహుల్ రాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.