సలార్ లో ఆ సన్నివేశం యాడ్ చేశారట..

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ తో సలార్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ముందు అనుకున్న ప్రకారం కాకుండా ఈ సినిమాలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని యాడ్ చేశారని తెలుస్తోంది. అంతేకాక.. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయిస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.