బట్టల్లేకుండా.. సల్మాన్.. ?

Salman-Khan-to-go-nude1
బాలీవుడ్‌ లో ఖాన్‌ ద్వయంగా సల్మాన్‌, అమీర్‌ ఖాన్‌ లు పేరొందిన విషయం తెలిసిందే. వీరిద్దరి మిత్రత్వంతో .. అమీర్ సినిమాల్ని సల్మాన్ ప్రమోట్‌ చేస్తుంటారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో ’ధూమ్‌-3’ ప్రమోషన్‌ చేశాడు. సినిమాలో అమీర్‌ ధరించిన టోపీతో సల్మాన్ ’బిగ్‌బాస్‌ 7’లో పాల్గొన్నారు. తాజాగా, ’బిగ్‌బాస్‌-8 ప్రారంభం కానుంది. అదే సమయంలో అమీర్‌ “పీకే” ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో.. బిగ్‌బాస్ షోలో సల్మాన్‌ .. న్యూడ్‌గా పాల్గొని ’పీకే’ ని ప్రచారం చేస్తే చూడాలని వుందని అమీర్ కామెంట్ చేశాడు. మరీ.. అమీర్ ఆశని సల్మాన్ తీరుస్తాడో.. ? లేదో.. ? చూడాలి.