పూజా ఛాన్స్ కొట్టేసిన సమంత

వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న పూజా హగ్దే..తాజాగా మహేష్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ – మహేష్ బాబు కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ కు జోడిగా పూజా హగ్దే ను ఖరారు చేసారు. అయితే ఇప్పుడు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం తో ఈ సినిమా నుండి తప్పుకుంది. దీంతో ఆ ఛాన్స్ సమంత కు దక్కినట్లు వినికిడి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన రానుంది. ప్రస్తుతం సామ్..చైతు తో విడాకులు తీసుకొని మళ్లీ సినిమాల ఫై దృష్టి పెట్టింది.