సామ్ ఫస్ట్ టైం విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పిందా..?

సమంత – నాగ చైతన్య లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..ఆ తర్వాత కొంతకాలానికి విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇచ్చారు. విడాకులు తీసుకున్నట్లు ఇద్దరు తెలిపారు కానీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుపలేదు. ఇప్పటికే అభిమానుల్లో ఈ ప్రశ్న అలాగే ఉండిపోయింది. తాజాగా సమంత నోరు విప్పినట్లు తెలుస్తుంది. సీజన్‌-7లో భాగంగా ఇటీవలే ఆమె ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా కెరీర్‌తో పాటు, నాగచైతన్య బంధానికి ఎందుకు ముగింపు పలకాల్సి వచ్చిందో కూడా చెప్పినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జులై 7న ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కానుందట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వార్తలు వైరల్‌ అవుతుండటం వల్ల ఈ షో ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఇటు సామ్‌ అభిమానులతో పాటు అటు చైతూ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక సామ్ – చైతు సినిమాల విషయానికి వస్తే.. శాకుంతలం, యశోద చిత్రాలతో సమంత ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్​దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తోంది. మరోవైపు నాగ చైతన్య నటించిన ‘లాల్​ సింగ్​ చద్ధా’, ‘థ్యాంక్యూ’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్​లో నటిస్తూ బిజీగా ఉన్నారు.