సమంత ట్వీట్..మరోసారి విడాకుల గురించే మాట్లాడుకునేలా చేసింది

గత కొద్దీ రోజులుగా సమంత – నాగ చైతన్య లు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సామ్ పెట్టిన ట్వీట్ ఆ వార్తలకు మరింత ఊపిరి పోసినట్లు అయ్యింది. నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది.

ఈ ట్రైలర్ ఫై సమంత ట్వీట్ చేసింది. ప్రతీసారి నాగ చైతన్య గురించి ఏదో ఒకటి చెబుతూఉంటుంది. కానీ ఈ ట్రైలర్ మీద స్పందిస్తూ చైతన్య గురించి ఏ ముక్కకూడా చెప్పలేదు. కానీ చైతన్య ట్వీట్‌‌కే సమంత రిప్లై ఇచ్చింది.. విన్నర్ అంటూ.. సినిమా టీం మొత్తానికి, సాయి పల్లవికి కంగ్రాట్స్ చెప్పింది. చైతన్య పేరును ప్రస్థావించలేదు అంటే వీరి విడాకుల వ్యవహారం నిజమే అయి ఉంటుందని కొందరు అంటున్నారు.

WINNER!!
All the very best to the team @Sai_Pallavi92 🤗.. #LoveStoryTrailer https://t.co/nt9rzTc3lY— S (@Samanthaprabhu2) September 13, 2021