సమంత ప్రెగ్నెంట్‌ ..?

అదేంటి నిజమా అని షాక్ అవుతున్నారా..నిజమే కాకపోతే రియల్ లైఫ్ లో కాదు సినీ లైఫ్లో. చైతు తో విడాకులు తీసుకున్న సామ్..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంది. రీసెంట్ గా పుష్ప లో ఐటెం సాంగ్ తో దుమ్ములేపిన ఈ భామ..ప్రస్తుతం “య‌శోద” సినిమా చేస్తుంది. పాన్ ఇండియా రెంజ్ లో తెలుగు తో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషాల‌లో ఈ సినిమా ను విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధం అవుతోంది. ఇక ఈ సినిమా హ‌రి – హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే శ్రీ దేవి మూవీస్ ప‌తాకం పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ సినిమా లో సామ్ ఓ ప్రెగ్నెంట్‌ లేడీగా దర్శనమివ్వనుందట. సినిమాలో దాదాపు గంటకు పైగా ప్రెగ్నెంట్‌ గా కనిపించనుందని అంటున్నారు. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.